టాలీవుడ్ ప్రస్తుత జెనరేషన్ హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆయన, సినిమా ఫలితం ఎలా ఉన్నా తను మంచి నటుడు అని అనిపించుకున్నారు. దీంతో బడా నిర్మాతలు సైతం తమ బ్యానర్లపై కిరణ్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న ‘రూల్స్ రంజన్’ అనే చిత్రంలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సంగతి తెలిసిందే. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా ఈనెల 28న విడుదల కావాల్సి ఉండగా.. మేకర్స్ దీనిని పోస్ట్ పోన్ చేశారు. అక్టోబర్ 6వ తేదీకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరూ సినిమా చూసి వినోదం లో తెలియాడాలనే ఉద్దేశ్యం, మరింత మందికి చేరువ కావాలనే సదుద్దేశ్యంతో, పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. కాగా ప్రస్తుతం మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.
అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాల కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదల అయిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. ‘రూల్స్ రంజన్’ నుంచి విడుదల అవుతున్న ప్రతీ ప్రచార చిత్రం సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇక ఈ సినిమాలో కిరణ్ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. అయితే కిరణ్ అబ్బవరం ఈ ఏడాది ఇప్పటికే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మరియు ‘మీటర్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























