టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉస్తాద్ రామ్ పోతినేని. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘స్కంద-ది అటాకర్’. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చిత్రం ప్రీరిలీజ్ థండర్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ.. “బోయపాటి శ్రీను ఏదైనా సరే మొండిగా నమ్మేసి ముందుకెళ్లిపోతారు. ట్రైలర్లో కనిపించిన నా మాస్ లుక్‌ను ఆయన ఏడు గంటల పాటు దగ్గరుండి మరీ రెడీ చేయించుకున్నారు. ఈ సినిమాలో బోయపాటి నన్ను ఇప్పటివరకూ ఎవరూ చూపని కొత్త పంథాలో చూపించారు. నా కెరీర్లో ‘స్కంద’ గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది. మా కాంబినేషన్లో సినిమా చేయాలనుందని నిర్మాత శ్రీనివాస్ ఐదేళ్ల క్రితమే నాతో చెప్పారు. అది నేటికి నిజమైంది. నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్ లేకపోతే ఈ సినిమా లేదు. ‘స్కంద’కి తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. నా అభిమానుల కోసం ఎంత కష్టానికైనా సిద్ధంగా ఉన్నా. వారిని మెప్పించడానికి వినూత్నమైన కథలతో సినిమా చేస్తా” అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం. ‘స్కంద’ ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. అలాగే ఇటీవలి ‘చంద్రయాన్ 3’ విజయంపై ఓ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసి ఇస్రో టీమ్‌కు అభినందనలు తెలిపారు. కాగా అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్, ఇంద్రజ, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: