ఏ మాయ చేశావే రోజులను గుర్తుచేసుకున్న సమంత

Samantha Shares Glimpses of Her Happy Place at NYC Mornings

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత రూత్ ప్రభు (సామ్‌) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో పాల్గొంది. అనంతరం అక్కడ హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో సమంత లోకల్‌గా ఉన్న పలు ఫేమస్‌ ప్లేసెస్‌ను విజిట్‌ చేస్తూ సందడి చేస్తోంది. అలాగే తన ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటోంది. కాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ నటి అయిన సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తన యాక్టింగ్ కెరీర్‌కు విరామం ఇచ్చిన ఆమె ఇప్పుడు న్యూయార్క్ నగరంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో సమంత తన కెరీర్‌లో మెమొరబుల్‌గా నిలిచిపోయే తొలి చిత్రం ‘ఏమాయ చేశావే’ రోజులను గుర్తు చేసుకుంది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్‌ న్యూయార్క్‌లోనే జరిగిందంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంది. 14 సంవత్సరాల తర్వాత మళ్లీ సెంట్రల్ పార్క్‌ను సందర్శించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని ప్రపోజల్ సన్నివేశం ఇక్కడి సెంట్రల్ పార్క్‌లోనే చిత్రీకరించారు. ఇక తాజాగా ఈ పార్క్‌కు వెళ్లిన సామ్‌ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ఈ సందర్భంగా.. న్యూయార్క్‌ నగరం కలల సాకారానికి అనువైన ప్రదేశంగా చెబుతుంటారని పేర్కొన్న సామ్, తన కెరీర్‌ కూడా ఇక్కడే ప్రారంభమైందని తెలిపింది.

అలాగే తాను నటించిన మొదటి చిత్రం షూటింగ్‌ ఇక్కడే జరిగిందని, అయితే అప్పుడు తాను ఈ ప్రయాణం ఎలా ఉంటుందో తెలియక భయపడిన చిన్న పిల్లనని చెప్పింది. కానీ అనంతరం ఎంతో ధైర్యంతో అడుగులు ముందుకేశానని, ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత అదే ప్రదేశానికి వచ్చి.. ఇండియా డే పరేడ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. అలాగే న్యూయార్క్ మార్నింగ్స్ అంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఈ చిత్రాలలో, పాన్-ఇండియా స్టార్ లేత నీలం రంగు డెనిమ్ జాకెట్‌లో ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఆమె లేత నీలం రంగు క్రాప్ టాప్ మరియు ఒక జత మ్యాచింగ్ లెగ్గింగ్‌లతో జత చేసింది. సిటాడెల్ స్టార్ ఒక జత స్టేట్‌మెంట్ సన్ గ్లాసెస్, తెల్లటి టోపీ, ఆమె సంతకం ‘లవ్’ బ్రాస్‌లెట్ మరియు ఒక జత లేత నీలం మరియు తెలుపు స్పోర్ట్స్ స్నీకర్‌లతో కనువిందు చేస్తోంది.

ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘ఖుషీ’ రిలీజ్ కు సిద్దంగా ఉంది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. అలాగే దీనితో పాటుగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సమంత కాప్ గా కనిపించనుంది. ఈ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.