బ్రహ్మానందం తనయుడి వివాహం.. హాజరైన పలువురు సినీ ప్రముఖులు

Tollywood Superstars Graced Brahmanandam's Son Wedding

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం (ఆగస్టు 18, 2023) రాత్రి ఘనంగా జరిగింది. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కుమార్తె ఐశ్వర్య‌ను సిద్ధార్థ వివాహమాడారు. తల్లిదండ్రులు, అతిథుల సమక్షంలో ఏడు అడుగులు నడిచి ఐశ్వర్య, సిద్ధార్థ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద గల అన్వయ కన్వెన్షన్స్‌లో రాత్రి 10.45 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అగ్రనటులు నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితరులు విచ్చేసి సందడి చేశారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ సతీమణి ఉపాసన సహా తల్లి సురేఖ, చెల్లి సుష్మితతో కలిసి వచ్చారు. ఇక వీరితో పాటుగా రాజశేఖర్ జీవిత దంపతులు, మంచు విష్ణు, మనోజ్, శ్రీకాంత్, సాయి కుమార్ తదితరులు తమ ఫ్యామిలీలతో హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా సీనియర్ నటులైన మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రావు రమేష్, రఘు బాబు, అలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్ ఉన్నారు. ఇక దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల సహా సీనియర్లు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి వచ్చారు. అలాగే నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వీరితో పాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరిలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు. కాగా బ్రహ్మానందంకు మొత్తం ఇద్దరు కుమారులు కాగా.. మొదటి కుమారుడు గౌతమ్ వివాహం ఇంతకుముందే జరిగిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.