టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు ‘సర్కారు నౌకరి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్కే టెలీషో ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘ నీళ్లా బాయీ’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలయింది. గాయని సోనీ కొమండూరి ఆలపించిన ఈ సాంగ్ వినసొంపుగా ఉంది. లక్ష్మీ మేఘన, హర్షిత మహిళా కోరస్ అందించగా.. శాండిల్య పిసపాటి, మొహనీష్ సాహు మరియు సింజిత్ యర్రామిల్లి తదితరులు మేల్ కోరస్ ఇచ్చారు. గీతరచయిత డా. పసునూరి రవీంద్ర ఈ పాటను రచించారు. మంచి మెలోడిగా సాగే ఈ పాట ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సర్కారు నౌకరి‘ సినిమాలో హీరో ఆకాష్ గోపరాజుతో పాటుగా భావనా వేదపండళ్, రమ్య పొందూరి, తనికెళ్ల భరణి, సూర్య మరియు సత్య సాయి శ్రీనివాస్ వడ్లమాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1996వ సంవత్సరంలో కొల్లాపూర్ లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ మరియు మూవీ ప్రమోషనల్ సాంగ్ కు విశేష స్పందన వచ్చింది. ఈ పాటను సింగర్ సునీత, హారిక నారాయణ్ మరియు సాహితీ చాగంటి ఆలపించారు. అలాగే కొద్దిరోజుల కిందట విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ కూడా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అందులో హీరో సైకిల్ మీద కనిపిస్తుండటం.. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై ‘పెద్ద రోగం చిన్న ఉపాయం’ అని రాసి ఉండటం.. ఇవన్నీ కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేశాయి. ఒక్కడి ఆలోచనతోనే విప్లవం మొదలవుతుంది అని ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే సినిమాలో కథ ఎంతో ఇంటెన్స్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక హీరో ఆకాష్ కు ఇది మొదటి సినిమా కావడం, అందులోనూ సింగర్ సునీత తనయుడు కావడంతో చిత్రంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























