ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో కూడా రామ్ మరోసారి మాస్ పాత్రలో అరించనున్నట్టు అర్థమవుతుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి నీ చుట్టూ చుట్టూ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాట ఏ రేంజ్ లో ఆకట్టుకుందో చూశాం. ముఖ్యంగా కలర్ ఫల్ గా ఉన్న ఈసినిమాలో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న 3 నేడు ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధకారికంగా ప్రకటించింది. సాంగ్ తో ఈసినిమా షూటింగ్ పూర్తయిందని.. మాసివ్ ఎనర్జిటిక్ కాంబో కోసం సెప్టెంబర్ 15వ తేదీన రెడీగా ఉండండి అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు మేకర్స్.
It’s a wrap for our #Skanda shoot with a song! 🎬❤️🔥
Get ready for the massive energetic combo massive feast on September 15th🔥🔥 #SkandaOnSep15 #RAmPOthineni
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @detakesantosh @StunShiva8… pic.twitter.com/lIPFJCVys9
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 9, 2023
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























