గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్లు

two massive sets erected two massive sets in Hyderabad for gunturu kaaram movie

గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో హిట్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గుంటూరు కారం అంటూ వచ్చేస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గత సినిమాల్లో కంటే భిన్నంగా ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో అలరించనున్నట్టు ఇప్పుటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే మధ్యలో కాస్త బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పడు నిర్విరామంగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా కొత్త షెడ్యూల్ కోసం రెండు భారీ సెట్ లను నిర్మించినట్టు తెలుస్తుంది. అందులో ఒకటి మహేష్ గ్రాండ్ ఫాదర్ ది కాగా మరొకటి మహేష్ తల్లి పాత్రకు సంబంధించినదిగా సమాచారం. ఈ సెట్లలో సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. కొత్త షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఆగష్ట్ 9 వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు కాగా ఆరోజు ఈసినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందేమో అని ఆసక్తిగా చూస్తున్నారు మేకర్స్. కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా.. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.