ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ లు అయిపోతుంటారు కొంతమంది హీరోలు, హీరోయిన్లు. అయితే అది కొంతమందికే కలిసొస్తుంది అనుకోండి. ఇక ఒక్క సినిమాతో ఒక్క తెలుగులో ఏంటి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది మృణాలు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సినిమా సీతారామం. పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటించి తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఈసినిమాతో అమ్మడు తెలుగులో మంచి అవకాశాలే అందుకుంటుంది. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా దీనితో పాటు విజయ్ దేవరకొండతో మరో సినిమాను చేస్తుంది. పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈమూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. అయితే నేడు మృణాల్ పుట్టిన రోజు సందర్భంగా సెట్‌లో ఆమె బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది చిత్రయూనిట్. సెట్‌లో ఆమె చేత కేక్ కట్ చేయించారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో విజయ్, మృణాల్ తో పాటు యంగ్ నిర్మాత హన్షిత రెడ్డి, శిరీష్‌లు కూడా ఉన్నారు.
Wishing the incredibly talented and graceful @MissThakurani a fantastic birthday! ❤️🔥
Team #VD13 and #SVC54 gathered to make her special day even more memorable. 🤩🙌🏻#HBDMrunalThakur@TheDeverakonda @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/W0GiNfr6UQ
— Sri Venkateswara Creations (@SVC_official) August 1, 2023
కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కేయూ మోహన్ పనిచేస్తుండగా.. సంగీతం గోపీసుందర్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























