మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ మొదటి నుండి కాస్త డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ప్రయత్నిస్తుండేవాడు. ఒకే తరహా జోనర్‌కు పరిమితం కాకుండా ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తున్నాడు. గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. నీజతై అంటూ వచ్చే ఈపాట ప్రోమోను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాటను ఇల్వ్యా ఇంకా నకుల్ అభయంకర్ ఆలపించారు. ఇక పాటలో వరుణ్ తేజ్ ఇంకా సాక్షి వైద్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. మెలోడియస్ ఉన్న ఈపాట శ్రోతలను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























