మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీసింహా. అంతేకాదు నటన పరంగా కూడా చాలామందిని ఆకట్టుకున్నాడు. మత్తువదలరా తరువాత ఆ రేంజ్ లో మరో హిట్ ను అందుకోలేకపోయాడు. ఆసినిమా తరువాత మూడు సినిమాలు తీసినా కూడా మూడు సినిమాలు కూడా సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు శ్రీసింహా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఉస్తాద్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 12వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బైక్ అంటే అమితమైన ప్రేమ ఉన్నఒక కుర్రాడు. ఆ బైకు మీద ప్రేమతోనే పైలెట్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. పేద కుర్రాడు కావడంతో పైలెట్ అవ్వడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ సవాళ్లను ఎదుర్కొని ఎలా పైలెట్ అయ్యాడు అన్నదే ఈసినిమా కథ. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. లవ్ ప్లస్ ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. చూద్దాం ఈసినిమా ఎంతవరకూ సక్సెస్ ను అందిస్తుందో.
కాగా ఈసినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. మసూద, బలగం సినిమాలతో ప్రస్తుతం కావ్య కూడా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అకీవా బి సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























