పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనేే సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయి టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అలానే సినీ ప్రేక్షకులకు వర్షం ప్రధాన అడ్డంకిగా నిలిస్తుంది. గత కొద్దిరోజులుగా ఎడతెరపని వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈరెండు రోజుల్లో ఆ ప్రభావం మరింత ఎక్కువైంది. దీంతో ఈ వర్షప్రభావం సినిమాపై బాగానే పడే అవకాశం ఉందంటున్నారు. మరి సినిమా ఓపెనింగ్స్ తోనే రికార్డులు క్రియేట్ చేసే పవన్ కు ఈసారి ఆ అవకాశం ఉంటుందో లేదో చూడాలి.
ఇదిలా ఉండగా ఈనేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేశారు. మీరు చూపిస్తున్న అమితమైన ప్రేమకు, సపోర్ట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.. బ్రో సినిమాను ఒక స్పెషల్ ప్రాజెక్ట్ గా భావించి మీరెంతగానో సెలబ్రేట్ చేస్తున్నారు. దీనిని మరింత ఎక్కువ మందికి చేరువ చేయడం కోసం భారీ కటౌట్స్, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బ్యానర్స్, కటౌట్స్ ఏర్పాటు చేసే సమయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ భద్రతే మాకు ముఖ్యం. ఈ సంతోషకరమైన వేడుకల్లో మీకు ఏమైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను అంటూ తేజ్ పోస్ట్ లో పేర్కొన్నాడు. పేర్కొన్నారు.
Your safety is above any celebration.
Please consider my humble request above your excitement and love.Forever Grateful 🙏#BroTheAvatar pic.twitter.com/Mx3BdKGCGX
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 27, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































