రిలీజ్ ముందే సలార్ రికార్డ్ – నెవర్ బిఫోర్ రిలీజ్

prabhas salaar movie never before release in usa

పాన్ ఇండియాా స్టార్ ప్రభాస్ క్రేజ్ మాత్రం సినిమాా జయాపజయాలకు అతీతంగా రోజు రోజుకూ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే అందరి దృష్టి ఇప్పుడు ప్రభాస్ నుండి రాబోతున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై పడింది. వీటిలో సలార్ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాజెక్ట్ అయితే ఇంకా షూటింగ్ దశలోనే అయితే ప్రాజెక్ట్ కే రిలీజ్ కు ఆరు నెలలు ముందుగానే ఇప్పటి నుండే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టేసింది. అ సంగతి పక్కన పెడితే ఇక ఇప్పుడు సలార్ సినిమా కూడా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. కె.జి.యఫ్ లాంటి సినిమాను తీసిన తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో నేషనల్ వైడ్ గా అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న టీజర్ గా రికార్డ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది ఈసినిమా. సలార్ సినిమా యూఎస్ఎ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రత్యంగిర సినిమాస్ వారు దక్కించుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా తమ ట్విట్టర్ ద్వారా ఈసినిమాను అక్కడ భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈసినిమాను అమెరికాలో 1979 లోకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతవరకూ ఏ ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో ఇన్ని లోకేషన్స్ లో రిలీజ్ కాలేదు. దీనితో పాటు 27వ తేదీన ప్రీమియర్ షోలు పడనున్నట్టు తెలుపుతూ రిలీజ్ డేట్ పై ఎలాంటి మార్పు లేదని మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.