బెదురులంక 2012 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ అప్ డేట్

bedurulanka 2012 release date announcement

టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైపోయింది. దీంతో దాదాపు ఈసినిమా గురించి అందరూ మరిచిపోతున్నారు అనుకునేలోపు ఈసినిమా రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను రేపు అంటే జులై 7వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు ఓ కామెడీ వీడియోతో తెలిపారు.

కాగా ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్‌, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.