టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది రెండు హిట్లను సొంతం చేసుకొని ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కోసం స్పై తో వచ్చాడు. గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించారు. జూన్ 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. విశేషం ఏంటంటే..ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నా కానీ కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. నిజానికి మిక్డ్స్ తెచ్చుకున్న సినిమాలు కలెక్షన్స్ పరంగా కూడా వీక్ అవుతుంటాయి. కానీ స్పై విషయంలో మాత్రం రివర్స్ అవుతుంది. ఈ సినిమా మాత్రం సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. రోజు రోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ వెళుతుంది. ఈసినిమా మొదటి రోజే మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. సెకండ్ డేకు కలెక్షన్స్ మరింత పుంజుకున్నాయి. ఇక వీకెండ్ కలిసొచ్చి సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు అవుతుంది. ఐదు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకొని బాక్సాఫీస్ వద్ద తన రాంపేజ్ కొనసాగిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
SPY box office rampage continues, surpassing 25 crores worldwide! 💥🔥
Action thriller #SPY is now in Cinemas!
Book Now :
Book My Show: https://t.co/pZiF3ohrvx
Paytm : https://t.co/jebGvIOI2E#IndiasBestKeptSecret 🇮🇳@actor_Nikhil @Garrybh88 @Ishmenon @tej_uppalapati… pic.twitter.com/n0n03PLXbS— Eluru Sreenu (@IamEluruSreenu) July 3, 2023
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా అభినవ్ గోమఠం,సన్యా మల్హోత్రా కీలక పాత్రలో కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.రాజశేఖర్ రెడ్డి,చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: