చరణ్-దీపికా సీక్రెట్ ప్రాజెక్ట్

ram charan and deepika padukone worked together for new project

ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోలు పలానా హీరోయిన్ తో చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి కాంబినేషన్ లో రామ్ చరణ్-దీపికా పదుకొనేది కూడా ఒకటి. దీపికా పదుకునే ఇప్పటికే ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుంది. ఇక ఆమధ్య మహేష్-దీపికా కాంబినేషన్ లో కూడా ఒక సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అవి వార్తలుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా రామ్ చరణ్-దీపికా పదుకొనే కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇది సినిమా కోసం కాదనుకోండి. అసలు సంగతేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ చరణ్- దీపికా కలిసి ఓ యాడ్ కోసం పనిచేసినట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా యాడ్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో తప్పిపోయిన భర్త ఆచూకీ తెలుసుకోవబానికి దీపికా పదుకొనె పోలీస్ స్టేషన్ కు వస్తుంది. ఇక పోలీస్ ఆఫీసర్‌గా నటుడు రణవీర్ సింగ్ కనిపిస్తుండగా.. రామ్ చరణ్ సీక్రెటివ్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. అంతేకాదు త్రిష కృష్ణ కూడా మరొక పాత్రలో కనిపించింది. మరి దీపికా భర్తకు ఏమైంది? ఈ కేసుకు రామ్ చరణ్ కు కనెక్షన్ ఏంటి? అసలు త్రిష ఎవరు? అన్నవిషయాలు తెలయాలంటే జూలై 5వ వరకూ వెయిట్ చేయాల్సిందే. దీంతో సినిమా కాకపోయినా ఈరకంగా అయినా తమ ఫెవరెట్ కాంబోను కలిసి చూస్తున్నందుకు చరణ్ అభిమానులు అయితే ఫుల్ హ్యాపీలో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by The Secret (@showme.the.secret)

మరి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఈసినిమా తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. మరోవైపు దీపికా తన సినిమాలతో తను బిజీగా ఉంది. మరి ఫ్యూచర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందేమో చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.