ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ అప్ డేట్

pawan kalyans ustaad bhagat singh second schedule update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న సినిమాల్లో అందరూ ఇంకాస్త ఆసక్తికరంగా ఎదురుచూసేది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై అంచనాలు ఉండటం కామనే. ఇక ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గ్లింప్స్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. గతకొద్ది రోజులుగా సెకండ్ షెడ్యూల్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయ. ఈ సెకండ్ షెడ్యూలో కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆద్వర్యంలో భారీ సెట్ ను ఏర్పాటు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా చిత్రనిర్మాణ సంస్థ ఈసినిమా సెకండ్ షెడ్యూల్ గురింటి అప్ డేట్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ ఎనర్జీతో మాసివ్ గా ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అంతేకాదు గబ్బర్ సింగ్ వర్క్ స్టిల్స్ ను ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ స్టిల్స్ ను షేర్ చేస్తూ కొన్ని బంధాలు ఎప్పటికీ మారవు.. మరోసారి చరిత్రను తిరిగిరాద్దాం అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో అశుతోష్ రానా, నవాబ్ షా, కె.జి.యఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.