పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా సముద్రఖని తమిళ్ లో దర్శకత్వంలో వహించిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనే ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను జూన్ 29 వ తేదీన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ అయి రెండు రోజులు అవుతున్నా ఈ టీజర్ మాత్రం రాంపేజ్ ఆడిస్తుంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. గతంలో పవన్ తన సినిమాల్లో చేసే కామెడీ, తన స్వాగ్, డైలాగ్స్, వింటేజ్ లుక్ అన్నీ ఈసినిమాలో మళ్లీ కనిపిస్తుండటంతో టీజర్ కు అంత రెస్పాన్స్ వస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్, సాయి థరమ్ తేజ్ మధ్య కెమిస్ట్రీ కూడా నచ్చేసింది అందరికీ. టీజర్ తోనే సినిమాపై అంచనాాలు పెంచేసి సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అన్న క్యూరియాసిటీని పెంచేశారు. ఇక టీజర్ మాత్రం మిలియన్ వ్యస్ ను సొంతం చేసుకొని సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. రెండు రోజుల్లో ఈటీజర్ 30 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని 513కే లైక్స్ తో టాప్ 1 ట్రెండ్ లో కొనసాగుతుంది.
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































