బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ ఈసినిమాలో గ్రాఫిక్సే కీలకపాత్ర వహిస్తాయి కాబట్టి ఇంకా టైమ్ తీసుకొని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇప్పుడు దీనిపై మరో ఆసక్తికర అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రీసెంట్ గానే బాల హనుమాన్ గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా ప్రతీ చిన్న డీటెయిల్ పై కూడా గ్రాఫిక్స్ పరంగా వర్క్ చేస్తున్నామని సిజి వర్క్ జరుగుతున్న మానిటర్ పిక్ షేర్ చేస్తూ మరి తెలిపాడు. మరి గ్రాఫిక్స్ లో కాస్త తేడా వస్తే ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే పలు సినిమాలకు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో అర్థమయింది.. దీంతో ప్రశాంత్ వర్మ అలాంటి అవకాశం ఇవ్వకుండా గ్రాఫిక్స్ విషయంలో మరింత కేర్ తీసుకుంటూ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.
Every detail matters! #HanuManVFX pic.twitter.com/T0knsWfvgX
— Prasanth Varma (@PrasanthVarma) June 26, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: