వింటేజ్ లుక్ లో పవన్ 

BRO Movie Mass Poster Released

పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో.షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈసినిమా వచ్చే నెల 28న థియేటర్లోకి రానుంది.విడుదలకు రోజులు దగ్గరపడుతుండండంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను విడుదలచేయనున్నారు.వచ్చే రెండు రోజుల్లో టీజర్ అప్డేడ్  రానుంది.ఈసందర్బంగా మేకర్స్ ఈరోజు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈపోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.పోస్టర్ లో పవన్ తో పాటు సాయి తేజ్ లుంగీ గెటప్ లో కనిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ఈపోస్టర్ పవన్ వింటేజ్ లుక్ ను గుర్తు చేసింది.తమ్ముడు సినిమాలో వయ్యారి భామ సాంగ్ లో లుంగీ తో మెడలో రుమాలుతో కనిపిస్తాడు పవన్.సరిగ్గా అలాంటి గెటప్ లోనే బ్రోలో కూడా కనిపించనున్నాడు. బ్రోలో ఓ స్పెషల్  సాంగ్ లో పవన్,సాయి తేజ్ కలిసి స్టెప్పులు వేయనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లోని స్టిల్ అందులోనిదే.ఈపోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈసినిమాలో పవన్ ఇంతకుముందు ఎన్నడూ లేనంత యాక్టీవ్ గా కనిపించనున్నాడట.

కోలీవుడ్ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.ప్రియా ప్రకాష్ వారియర్,కేతిక శర్మ,బ్రహ్మజీ,తణికెళ్ల భరణి,రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =