శ్రీసింహా భాగ్ సాలే ట్రైలర్ రిలీజ్

sri simha bhaag saale movie trailer out

ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా వస్తున్న సినిమా భాగ్ సాలే. గతంలో వచ్చిన తెల్లవారితే బుధవారం, దొంగలుపడ్డారు జాగ్రత్త సినిమాలు అనుకున్నంత విజయాన్ని అందించలేకపోవడంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు శ్రీసింహా. జులై 7వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో వీడియోను రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఆవీడియోను బట్టి ఈసినిమా ఓ వజ్రపు ఉంగరం చుట్టూ తిరుగుతుందనేది అర్థమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ఫన్ రైడర్ లా ఉండి ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ప్రకారం అర్జున్ (శ్రీసింహా) ఓ రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తుంటాడు. అంతేకాదు మాయతో (నేహీ సోలంకీ) ప్రేమలో పడతాడు. మరోవైపు శామ్యూల్ (జాన్ విజయ్) అనే వ్యక్తి డైమండ్ రింగ్ కోసం అర్జున్ వెనక పడుతుంటాడు. మరి శామ్యూల్ అర్జున్ వెనుక ఎందుకుపడుతుంటాడు.. రింగ్ కు అర్జున్ కు ఉన్న లింక్ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా విజువల్స్ క్లీన్ గా ఉన్నాయి. మరి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది… సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఇంకా ఈసినిమాలో రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.