ప్రభాస్ పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వడానికి

Prabhas' name is enough to shake the box office

టాక్ తో సంబంధం లేకుండా మరోసారి మొదటి రోజే 100కోట్ల క్లబ్ లో చేరి  రెబల్ స్టార్ ప్రభాస్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.బాహుబలి తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది.ఈసినిమా తెలుగులోనే కాదు హిందీలోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక బాహుబలి 2 తో రికార్డులు అన్ని బ్రేక్ చేశాడు.ఈరెండు సినిమాలతో ప్రభాస్ హిందీ మార్కెట్ అక్కడి స్టార్ హీరోల మార్కెట్ సరసన చేరింది.బాహుబలి 2 తరువాత ప్రభాస్ నటించిన సాహో ప్లాప్ టాక్ తో మొదటి రోజు 100కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.ఇప్పుడు తాజాగా ఆదిపురుష్ తో మరోసారి అదే మ్యాజిక్ ను క్రీయేట్ చేశాడు ప్రభాస్.నిన్న విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 140కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో ఆర్ఆర్ఆర్,బాహుబలి 2 తరువాత తొలిరోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో సినిమాగా ఆదిపురుష్ రికార్డు సృష్టించింది.అంతేకాదు తొలి రోజే మూడు సినిమాలతో 100కోట్ల రాబట్టిన మొదటి ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

దాంతో అదిపురుష్ తో మరోసారి బిగ్గెస్ట్ క్రౌడ్ ఫుల్లర్ అని నిరూపించుకున్నాడు ప్రభాస్.ఆదిపురుష్ కి ఈరోజు,రేపు కూడా బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.ఈ వీకెండ్ లో 200కోట్ల  గ్రాస్ మార్క్ ను క్రాస్ చేయనుంది.ఆతరువాత సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.రామాయణం ఆధారం గా ఓం రౌత్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రభాస్,రాముడిగా నటించగా కృతి సనన్,సీతగా కనిపించింది.అజయ్ -అతుల్ అందించిన సంగీతం,సంచిత్ -అంకిత్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.