కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోరు మీదున్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన మేకర్స్, ఈరోజు పవర్ఫుల్ టీజర్‌ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రంగాపురం అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడి పురాతన ఆలయంలోని విగ్రహాలన్నీ ఒక్కసారిగా మాయమవడం, అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురవడంతో కథలో మిస్టరీ మొదలవుతుంది. ఈ రహస్యానికి మరో ఆసక్తికరమైన కోణాన్ని జోడిస్తూ, నిర్ణీత గడువులోగా ఆలయంలోని విగ్రహాలన్నీ తిరిగి వస్తాయని ఆలయ పూజారి నమ్ముతాడు. ఈ వింత ఘటనపై దర్యాప్తు చేసేందుకు దేవుడిపై నమ్మకం లేని ఓ పోలీస్ అధికారిని నియమిస్తారు. దీంతో విశ్వాసం, హేతుబద్ధమైన ఆలోచన, అంతుచిక్కని రహస్యాల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణకు తెరలేస్తుంది.
మిస్టికల్, భక్తి, యాక్షన్ అంశాలను సమన్వయం చేస్తూ దర్శకుడు లుధీర్ బైరెడ్డి ఆసక్తికరమైన కథనాన్ని రూపొందించారు. ఆద్యంతం ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ, రంగాపురంలో చోటుచేసుకుంటున్న రహస్య ఘటనల వెనుక ఉన్న అసలు నిజాలేమిటనే ఆసక్తిని ప్రేక్షకుల్లో పెంచేలా టీజర్‌ను కట్ చేశారు.
దేవుడికంటే మానవత్వంపై నమ్మకం ఉంచే పోలీస్ అధికారిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రను ఆవిష్కరించిన తీరు కథకు మరింత ఇంటెన్స్ తీసుకొచ్చాయి. యాక్షన్‌తో కూడిన ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, ఆలయ పూజారి పాత్రలో మహేష్ మంజ్రేకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
ప్రొడక్షన్ డిజైనర్ శివ కామేష్ డి, ఆకల్ట్ నేపథ్యానికి తగిన మిస్టికల్ ప్రపంచాన్ని సృష్టించారు. సినిమాటోగ్రాఫర్ హరీష్ కన్నన్ తన అద్భుతమైన విజువల్స్‌తో కథనానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ తన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఉత్కంఠను, మిస్టరీని మరింత ఎలివేట్ చేశారు. కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఉన్నాయి.
ఆసక్తికరమైన కథాంశం, మిస్టరీని పెంచే విజువల్స్, పవర్ ఫుల్ నటన, కథనంతో ‘హైందవ’ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రాన్ని నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























