అల్లరి నరేష్ కెరీర్‌లో ‘సుడిగాడు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తిస్థాయి స్పూఫ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి అభిమానులను అలరించింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సుడిగాడు 2’ చేయడానికి ఎదురవుతున్న పెద్ద సమస్యను అల్లరి నరేష్ వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి భాగమైన ‘సుడిగాడు’ తీసే సమయంలో దాదాపు 108 సినిమాల సన్నివేశాలను స్పూఫ్ చేయడానికి చిత్రబృందం ముందస్తుగా అనుమతులు తీసుకుంది. అయితే ప్రస్తుత కాలంలో కాపీరైట్ చట్టాలు మరియు డిజిటల్ రైట్స్ నిబంధనలు మునుపటి కంటే చాలా కఠినంగా మారాయి. ఇప్పుడు ఏ చిన్న సినిమా సీన్‌ను స్పూఫ్ చేయాలన్నా ప్రొడక్షన్ హౌసెస్ నుండి ముందస్తు అనుమతులు పొందడం తప్పనిసరి.
సినిమా విడుదలైన తర్వాత కూడా ఆయా సినిమాల నిర్మాతలు లేదా హక్కుదారులు నుంచి అభ్యంతరాలు, లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన కాపీరైట్ ఇబ్బందులు, చట్టపరమైన సమస్యల వల్లే ‘సుడిగాడు 2’ చేయడం ప్రాక్టికల్‌గా చాలా కష్టమవుతోందని అల్లరి నరేష్ తెలిపారు. సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఈ కాపీరైట్ మరియు అనుమతుల ప్రక్రియే సినిమాకి పెద్ద అడ్డంకిగా మారిందని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























