బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మలయాళ వెర్షన్  నైజాంలో  దాదాపు 60 లక్షలు గ్రాస్ చేసింది – మైత్రి రవి

Bethlehem Kudumba Unit Malayalam Version Collects Nearly ₹60 Lakh Gross in Nizam says Mythri Ravi

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నైజాంలో మేము మలయాళం వెర్షన్ రిలీజ్ చేశాము. ఆ మలయాళం వెర్షన్ దాదాపు 60 లక్షలు గ్రాస్ చేసింది. అది మామూలు నెంబర్ కాదు. దీంతో మేము తెలుగులో కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాము. తెలుగులో కూడా ఇది సెన్సేషన్ చేస్తుంది. మనకి ‘ఇరుముడి’ లాగా ఈ సినిమా మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసింది. మమితా నుంచి వరుసగా సూపర్‌హిట్ సినిమాలు వస్తున్నాయి. సినిమాలన్నీ అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఫాజిల్ గారు మా హీరో.  ఆయనతో కూడా మేము కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుంది. మీరు సెప్టెంబర్ 4న థియేటర్‌లో కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.