అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవల హిందూ దేవతల పేర్లు, వర్షణ సంబంధిత అంశాలపై సెన్సార్ బోర్డు వ్యక్తం చేసిన కొన్ని అభ్యంతరాల కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ను జారీ చేసింది.అల్లరి నరేష్ సరసన సురభి కథానాయికగా నటించగా, రాశి సింగ్, విష్ణుప్రియ మరియు ప్రిషా సింగ్ వరుసగా రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నవ్వించనున్నారు.
చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
సరికొత్త కథాంశంతో, స్వర్గానికి భూలోకానికి మధ్య జరిగే ఒక ‘కాస్మిక్ మిస్టేక్’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ ఫన్ రైడర్ సినిమాను ముందుగా ప్రకటించినట్లే సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























