ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంది. మొదటి భాగం అందించిన క్రేజీ ఫన్ను మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కకుమానులతో పాటు ఈసారి మాగంటి శ్రీనాథ్ కీలక పాత్రలో అలరించనున్నారు. వీరి కాంబినేషన్ మరియు టైమింగ్ ప్రేక్షకులకు మరోసారి అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్‌ను అందించబోతోంది. తరుణ్ భాస్కర్ మార్క్ మేకింగ్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి 2026 నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
పాజిటివ్ బజ్ మధ్య రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. మొదటి భాగం ఈ నగరానికి ఏమైంది కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. మరి ఈ సీక్వెల్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























