గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన “ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా” ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్ ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
NBK111 నుంచి మరో పెద్ద అప్డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వీర సింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కావడంతో మరిన్ని అంచనాలని పెంచుతోంది.
NBK111 లో మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా, రామ్ లక్ష్మణ్, రవి వర్మ , వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























