దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ . మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ ‘RDX’ ఫేం నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దుల్కర్ నిర్మాతగా ‘లోక’ సినిమా వేడుకకు వచ్చాను. ఆ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఐయామ్ గేమ్’ సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆయన నిర్మించడమే కాదు, నటించారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా నేను కొంత చూశాను. ఇందులోని కాన్సెప్ట్‌కు మీరందరూ సర్ప్రైజ్ అవుతారు. ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా ఫన్ ఉంటుంది. దుల్కర్ గారు మంచి సినిమాలను ఇష్టపడతారు. ‘మహానటి’ నుంచి ఆయనతో నాకు జర్నీ ఉంది. ఆయన కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చే నటుడు. ఆయన కథ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. తప్పకుండా సెప్టెంబర్ 3వ తేదీన చాలా మంచి సినిమాను చూడబోతున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























