దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ . మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ ‘RDX’ ఫేం నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా ప్రొడక్షన్లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్. నేను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ఇది తెలుగులో తీసిన ఒక పెద్ద సినిమాలాగే ఉంది అని చెప్పారు. ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్ మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు హీరోలను ఆదరించడంలో చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు.. ఇలా ఎవరి పేరు చెప్పినా ప్రేక్షకులు కేరింతలు కొడతారు. అది తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం. మీ అందరి మనసులో నాకు కూడా చోటు కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాతో కూడా అలరిస్తానని నమ్ముతున్నాను. ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పాను. నాగి ఈ సినిమా చూశారు. ఆయన ఎడిటింగ్‌లో హెల్ప్ కూడా చేశారు. సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమాను మీరు కచ్చితంగా థియేటర్లో చూడండి. మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. తెలుగులో ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మహానటి’ నా ఫేవరెట్. అది నాకు పాత్ బ్రేకింగ్ సినిమా. నా తెలుగు కెరీర్‌కు క్రెడిట్ మొత్తం నాగి, స్వప్న, ప్రియాంకకే ఇస్తాను. ఈరోజు నా సినిమాను ప్రమోట్ చేస్తున్నానంటే దానికి కారణం నాగి, స్వప్న, ప్రియాంక. వైజయంతి సినిమా అంటే నాకు ఫ్యామిలీ. నాగి ఎప్పుడు కాల్ చేసినా తన సినిమాలో చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























