విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థాంక్స్ మీట్‌లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మేమందరం కొత్తవాళ్లం కలిసి ఇంత భారీ బడ్జెట్‌తో ఒక కొత్త ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నానికి ఆడియన్స్ అందరూ కూడా థియేటర్‌కు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది ఆడియన్స్ అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ మీద కనిపిస్తుంటే చెప్పులు తీసి సినిమా చూస్తున్నారు. వాళ్ల కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. మేము విమర్శకులను ఎప్పుడూ గౌరవిస్తాం. కాకపోతే కొంతమంది విమర్శకులు సినిమా చూడొద్దని కామెంట్లు చేస్తున్నారు. దయచేసి అలాంటి కామెంట్లు చేయొద్దు. ఒక సినిమాను చూడాలా వద్దా అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. అనంత పద్మనాభ స్వామి సినిమాలో కనిపిస్తుంటే ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంతకంటే ఎమోషన్ ఏముంటుంది? ‘హర హర మహాదేవ’ నినాదంతో థియేటర్ అంతా మారుమోగుతుంటే ఇంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది? మన సనాతన ధర్మం, మన చరిత్రను తెరపై చూపిస్తుంటే ప్రతి ఒక్కరూ థియేటర్‌లో ‘హర హర మహాదేవ’ అంటున్నారు. డైరెక్టర్ గారు చాలా గొప్ప విజన్ తో ఈ సినిమా తీశారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను.
ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. బుక్ మై షోలో సినిమా ట్రెండింగ్‌లో ఉంది. ప్రేక్షకులు సినిమాను బ్రహ్మరథం పట్టి వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతి భాషలో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. కొత్త నిర్మాతలు ఒక కథను నమ్మి ఇంత భారీ స్థాయిలో సినిమాను తీశారు. ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. పరమశివుడే మా వెనుక ఉండి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారని నమ్ముతున్నాం. మీ మనసును నమ్మండి. ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో ప్రతి ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. క్లైమాక్స్‌లో నాగసాధువును చూస్తున్నప్పుడు ‘శివుడే వచ్చి కనిపించాడు’ అని ప్రేక్షకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చప్పట్లు కొడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ వారం కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తాయని నమ్ముతున్నాను. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ సినిమాను చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. ఇంత గొప్ప ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























