నాగబంధం నుండి  వీరనాగ సాంగ్ రిలీజ్ 

Veera Naga Telugu Song From Nagabandham out now

‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ వీరనాగ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘వీరనాగ’ పాట నాగ సాధువుల ఆధ్యాత్మిక తాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. శ్రీహర్ష ఈమని సాహిత్యం ఆధ్యాత్మిక భావాన్ని బలంగా ప్రతిబింబించగా, దీపక్ బ్లూ తన పవర్ ఫుల్ వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు. 

జునైద్ కుమార్ – అభే అందించిన సంగీతం ప్రతి ఫ్రేమ్‌లో భక్తి భావాన్ని మరింత ఎలివేట్ చేసింది. కైలాస పర్వతాన్ని తలపించే అద్భుతమైన నేపథ్యంతో తెరకెక్కించిన ఈ పాటలో నాగ సాధు తాండవం విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారీ కాన్వాస్, ఆధ్యాత్మిక వైభవం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్ కలిసి ప్రతి ఫ్రేమ్‌ను ఓ దివ్య దర్శనంలా మలిచాయి.

నాగ సాధుగా గా విరాట్ కర్ణ తాండవం కట్టిపడేసింది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వున్నాయి. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ పాటలోని హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది.వీర నాగ’ పాటతో ‘నాగబంధం’పై అంచనాలు మరింత పెరిగాయి. పురాణ గాథలు, ఆధ్యాత్మికత, విజువల్ గ్రాండియర్‌ను మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినీ అనుభూతిని అందించబోతోందనే నమ్మకాన్ని ఈ పాట మరింత పెంచింది.నాగబంధం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.