సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు అమాంతం పెరిగాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తారు. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 4న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను తాజాగా రివీల్ చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్లో సుహాస్, సూరి ఎదురెదురుగా నిల్చుని కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉండబోతోన్నాయని సమాచారం.
ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. చిత్ర బృందం ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.
క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సూరి, సుహాస్ మార్కెట్‌ను, వారి స్థాయిని పెంచేలా ఈ సినిమా ఉంటుంది. ఇక మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్లతో ‘మండాడి’పై అంచనాలు పెంచనున్నారు. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























