ఆసక్తికరంగా మకుటం టీజర్ రిలీజ్

Intriguing Teaser of Makutam Released

‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ‘మకుటం’ రూపుదిద్దుకుంటోంది. స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది.  రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ రోజు (జూన్ 11) మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ ఇచ్చిన హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఇందులో అంజలి మాస్ యాక్షన్‌ను చూడొచ్చు. అంజలి ఓ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇక విశాల్ అయితే మూడు డిఫరెంట్ గెటప్స్‌లో తన విశ్వరూపం చూపించారు. ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని టీజర్‌ని చూస్తేనే తెలుస్తోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ అద్భుతమైన పనితీరుని కనబర్చారని టీజర్ స్పష్టంగా చెబుతోంది.

స్టైలిష్, విజువల్ ట్రీట్‌లా విశాల్ ఈ మూవీని తెరకెక్కించారు.  సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం కానున్నాయి. ఈ సినిమాకి ఎడిటర్‌గా ఎన్.బి. శ్రీకాంత్, జి. దురైరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు.

మొత్తం మీద ఈ టీజర్‌ ఒక్కసారిగా ‘మకుటం’పై భారీ అంచనాల్ని పెంచేసింది. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ దర్శకత్వం, ఆకట్టుకునే సాంకేతిక నైపుణ్యం, ఆసక్తికరమైన కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని అతని కెరీర్‌లోనే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. ‘మకుటం’ జూలైలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.