విడుదలకు సిద్దమైన మా ఇంటి బంగారం

Maa Inti Bangaram Completes Censor Formalities

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం తన సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి ‘U/A’ సర్టిఫికేట్ లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాతో దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తుంది. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ తెచ్చుకుంది.

రెండు గంటల 34 నిమిషాల (154 నిమిషాలు) పర్‌ఫెక్ట్ రన్‌టైమ్‌తో లాక్ అయిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు సాలిడ్ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ సిరీస్‌లలో పవర్‌ఫుల్ యాక్షన్‌తో అదరగొట్టిన సమంత.. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ సాహసం చేసింది. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో సమంత సాంప్రదాయ చీరకట్టులో ఎలాంటి డూప్ లేకుండా సొంతంగా భారీ యాక్షన్ స్టంట్స్ చేసింది.

సాధారణ గృహిణిలా అత్తగారింటికి వెళ్లిన ఒక మహిళ వెనక ఉన్న పవర్‌ఫుల్ యాక్షన్ సైడ్ ఏంటి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమా రూపొందింది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఎడ్జీ కామెడీ కూడా ఉండబోతోంది.

సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై రాజ్‌ నిడియోరు, హిమాంక్ దువ్వురులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అదిరిపోయే మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

ఈ సినిమాలో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, శ్రీముఖి కీలక పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.