దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘‘భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. గ్రామీణ మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన తన సినిమాల ద్వారా శాశ్వతమైన సినీ కవిత్వంగా మలిచి మనకి అందించారు. ఆయన చిత్రాలు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను తాకడమే కాకుండా తరతరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి.
పద్మశ్రీతో పాటు పలు జాతీయ పురస్కారాలను అందుకున్న భారతీరాజా గారు, భారతీయ సినిమాకు చేసిన సేవలు వెలకట్టలేనివి.
‘ఆరాధన’ చిత్రంలో ‘పులిరాజు’ పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకున్న అపారమైన ప్రేమ, నిరాడంబరత, తన కళ పట్ల అంకితభావం నాపై చెరగని ముద్ర వేశాయి.
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన అద్భుతమైన చిత్రాల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.
“ఇయక్కునర్ ఇమయం” భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏 అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























