అఖిల్ అక్కినేని, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ మాస్ డ్రామా ‘లెనిన్’ . కింగ్ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మధుర క్షణాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ టీజర్ లాంచ్‌పై నాగార్జున స్పందిస్తూ.. “ఈరోజు మే 23 నా సినీ జీవితం మొదలైన రోజు. అఖిల్ నాకో చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. చూస్తుంటే చాలా హాయిగా ఉంది. మీరు చూడండి. మనోడు వస్తున్నాడు” అని ఎమోషనల్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ పెట్టారు.
స్టేజ్ నాటకంలో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. సీనియర్ ఎన్టీఆర్ గారి శక్తివంతమైన డైలాగ్ “ఆచార్య దేవా.. ఏమంటివి ఏమంటివి” అంటూ చెప్పడం.. దానికి అఖిల్ “ఎన్టీఆర్ అంత గొప్పగా కాకపోయినా నువ్వు బాగానే చెప్పినావులే” అని చిత్తూరు యాసలో ఇచ్చే రిప్లైతో టీజర్ చాలా బ్యూటిఫుల్‌గా స్టార్ట్ అవుతుంది.
ఇప్పటివరకు స్టైలిష్‌గా కనిపించిన అఖిల్.. ఈ సినిమాలో పక్కా రాయలసీమ రూరల్ యువకుడిగా కనిపించి షాక్ ఇచ్చారు. ఆయన రగ్గడ్ లుక్, బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా చిత్తూరు యాస పలికించిన తీరు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
“నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన” అని అఖిల్ చెప్పే డైలాగ్, కత్తితో నరికే సీన్ సినిమాలోని ఇంటెన్స్ ఎమోషన్స్ మరియు పీరియాడిక్ విలేజ్ డ్రామాను కళ్ళకు కడుతోంది.
పల్లెటూరి లంగాఓణీ కల్చర్ లో భాగ్యశ్రీ బోర్సే చాలా హోమ్లీగా, అందంగా కనిపించింది. అఖిల్-భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా ఉంది. అలాగే ఇందులో అఖిల్ అక్కాబావలుగా శరణ్య, శివాజీ నటిస్తుండగా.. బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ప్రవీణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎస్. తమన్ అద్భుతమైన మ్యూజిక్ అండ్ బీజీఎమ్ అందించగా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ అందించారు.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ‘లెనిన్’ చిత్రం.. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. “అమ్మిలందరూ తట్టుకోండి.. మనోడు వస్తున్నాడురోయ్” అంటూ అఖిల్ ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టి వేటకే సిద్ధమయ్యాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























