డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘గాయపడ్డ సింహం’. ‘నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమా ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంచి అంచనాల మధ్య మే 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు నెలరోజుల లోపే డిజిటల్ ప్లాట్ఫామ్లో వచ్చేసింది.
ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నేటి నుండి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది.
కథ :
దరహాస్ (తరుణ్ భాస్కర్) ఒక సాదాసీదా మధ్యతరగతి కుర్రాడు. అమెరికాలోని డల్లాస్ వెళ్లి డాలర్లు సంపాదించి లైఫ్‌లో సెటిల్ అవ్వాలనేది అతని ఏకైక కల. కానీ, అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కఠినమైన వీసా నిబంధనల వల్ల దరహాస్ అమెరికా ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపబడతాడు. దీంతో తన కెరీర్ నాశనం కావడానికి ట్రంపే కారణమని భావించిన దరహాస్, అతనిపై తీవ్రమైన కక్ష పెంచుకుంటాడు.
మామూలుగా అయితే ఎవరైనా కోర్టుకు వెళ్తారు లేదా సోషల్ మీడియాలో తిడతారు. కానీ దరహాస్ మాత్రం వెరైటీగా హైదరాబాద్ గల్లీలో కూర్చుని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై ‘బ్లాక్ మ్యాజిక్’ (చేతబడి) చేయాలని డిసైడ్ అవుతాడు. ఇందుకోసం అతను మరో వింతైన వ్యక్తిని (శ్రీవిష్ణు) కలుస్తాడు. ఈ క్రేజీ మిషన్‌లోకి బ్రూటల్ ధర్మ (జె.డి. చక్రవర్తి), యూట్యూబర్ శాలిని (ఫరియా అబ్దుల్లా) ఎలా ప్రవేశించారు? అసలు వైట్ హౌస్ ప్రెసిడెంట్‌పై వీరు చేసిన మంత్రతంత్రాలు పనిచేశాయా? చివరికి దరహాస్ పగ తీరిందా? లేదా? అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























