టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ ఈ పవర్‌ఫుల్ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్‌లో రామ్ చరణ్ ఊరమాస్, రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు పూనకాలు తెప్పించారు. ఉత్తరాంధ్ర యాసలో ఆయన చెప్పిన డైలాగులు, బాడీ లాంగ్వేజ్ మునుపెన్నడూ చూడని విధంగా ఉన్నాయి.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కేవలం ఆట మాత్రమే కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు రివెంజ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు చూపెట్టారు.
ట్రైలర్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద అసెట్‌గా నిలిచింది. ప్రతి ఎలివేషన్ సీన్‌ను ఆయన తన మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.
జాన్వీ కపూర్ గ్లామర్: చరణ్ సరసన నటిస్తున్న జాన్వీ కపూర్ పల్లెటూరి పడుచు పిల్లగా చాలా హోమ్లీగా, అందంగా కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ కానుంది.
నిన్ననే మెగాస్టార్ చిరంజీవి లీక్ చేసిన “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు..” అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. దీంతో పాటు చరణ్ చెప్పిన మరికొన్ని వన్-లైనర్స్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం.
ఈ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దాదాపు 3 గంటల నిమిషాల నిడివితో ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఇక నేటి నుండి చిత్ర బృందం దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో భారీ ప్రమోషన్ల టూర్‌ను ప్రారంభించనున్నారు. జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























