పెద్ది రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్

Buchi Babu Sana Reveals Peddi New Release Date

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) విడుదల తేదీపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. ఈ సినిమాను జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధనుష్ నటిస్తున్న ‘కర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన బుచ్చిబాబు, అక్కడ ఈ క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చారు. అంతకుముందు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ మరియు భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా జూన్ నెలకు వాయిదా వేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం రామ్ చరణ్ మరియు శృతి హాసన్ లపై ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తయినట్లే.

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో పాటు, చరణ్ మాస్ ఇమేజ్‌కు సరిపోయే కథ కావడంతో మెగా అభిమానులు ఈ చిత్రం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జూన్ 25న థియేటర్లలో ‘పెద్ది’ జాతర మొదలవ్వడం ఖాయం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.