ఒకే ఓటీటీలోకి బైకర్ ,రాకాస

Biker and Rakasa Arriving on OTT the Same Day

శర్వానంద్ నటించిన రేసింగ్ డ్రామా ‘బైకర్’ మరియు సంగీత్ శోభన్ నటించిన హారర్ కామెడీ ‘రాకాస’ రెండు సినిమాలు కూడా ఒకే రోజు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే ఓటీటీలో మే 1, 2026 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బైకర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ,హిందీలో ‘శర్వా’ అనే టైటిల్‌తో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ చిత్రం భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ నేపథ్య సినిమా. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో పాటు థ్రిల్లింగ్ రేసింగ్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు.

ఇక రాకాస కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. తెలుగు ,తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో ఈసినిమా అందుబాటులోకి రానుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. ఒక పురాతన బ్రహ్మ రాక్షసుడు మరియు ఒక గ్రామానికి ఉన్న శాపం చుట్టూ తిరిగే ఈ కథ, భయం మరియు నవ్వుల మిశ్రమంగా సాగుతుంది. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.

ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఒకే రోజు రెండు విభిన్న జానర్లకు (రేసింగ్ అండ్ హారర్ కామెడీ) చెందిన సినిమాలు విడుదలవుతుండటంతో వచ్చే వీకెండ్‌లో సినీ ప్రియులకు మంచి వినోదం లభించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.