ది బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Chiranjeevi Unveils The Breaking News First Look

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు” అని తెలిపారు. అలాగే అనన్య నాగళ్ల నటనను కూడా ప్రశంసించారు. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, విభిన్నంగా తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.

చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, “ది బ్రేకింగ్ న్యూస్” ఒక మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.