పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు కోలీవుడ్ మూవీ ‘యూత్’ ఈరోజే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ గత నెలలో థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఓటీటీలో మాత్రం పవన్ ఫ్యాన్స్ నుండి భారీ వ్యూస్ సాధించే అవకాశం ఉంది. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఇక ఈసినిమాతోపాటు రీసెంట్ కోలీవుడ్ సూపర్ హిట్ యూత్ కూడా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. పాఠశాల దశలో ప్రేమ కోసం తపించే ఒక కుర్రాడి ప్రయాణాన్ని, హృదయాన్ని హత్తుకునేలా మరియు హాస్యభరితంగా ఈ సినిమాలో చూపించారు. కెన్ కరుణాస్ ప్రధాన పాత్రలో నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. థియేటర్లలో చిన్న సినిమాగా వచ్చి మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు, తమిళం (ఒరిజినల్), హిందీ, కన్నడ మరియు మలయాళంలో ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది.
వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనే ‘బీఫ్’ సీజన్ 2 మరియు ‘యూఫోరియా’ సీజన్ 3 కూడా ఈ వారమే అందుబాటులోకి రావడం విశేషం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























