నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు ‘ నుండి మొదటి సింగిల్ రా రా ధీవర కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.’సలార్’, ‘కేజీఎఫ్’ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్, ఈ పాటలో కూడా తనదైన ‘థంపింగ్’ బీట్స్‌తో మ్యాజిక్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంతోష్ వెంకీ బేస్ వాయిస్ ఈ పాటలోని గాంభీర్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ‘రా రా ధీవర’ అనే హుక్ లైన్ చాలా క్యాచీగా ఉంది.ఒక గొప్ప యోధుని పరాక్రమాన్ని కీర్తిస్తూ సాగే ఈ పాట అదిరిపోయింది. లిరిక్స్ మరియు మ్యూజిక్ రెండూ కలిసి విజువల్స్‌కి ఒక ‘ఎపిక్’ ఫీల్‌ను ఇస్తున్నాయి.
నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. లాంగ్ హెయిర్, ముతక గడ్డం, మరియు ఆ యుద్ధ దుస్తుల్లో ఆయన లుక్ బాగుంది. పిక్సెల్ స్టూడియోస్ నిర్మాణ విలువలు మరియు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో చూపిస్తున్నాయి.
మొత్తానికి రా రా ధీవర సాంగ్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. మే 15న ఈసినిమా పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే టీజర్ తో సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఇందులో నాబా నటేష్ , సంయుక్త కథానాయికలు నటించగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో భారీ బడ్జెట్ తో భువన్ – శ్రీకర్ నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























