కరుప్పు తెలుగు టైటిల్ వీరభద్రుడు

Karuppu Gets Telugu Title

సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్  ‘కరుప్పు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ  చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది.తాజాగా ఈ చిత్రానికి తెలుగులో వీరభద్రుడు అనే  టైటిల్ పెట్టారు. సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించిన టైటిల్ పోస్టర్ అదిరిపోయింది.

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీ.2026 మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.