బైకర్ ట్రైలర్ రిలీజ్

Biker Trailer Impresses with Next-Level Content

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు వచ్చాయి. ఇక తాజాగా విడుదలచేసిన ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండియన్ రేసర్లు ప్రపంచ స్థాయి ప్రతిభావంతులతో సమానంగా నిలబడగలరా అని ఒక ఫారిన్ స్పోర్ట్స్ యాంకర్ ప్రశ్నించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ వున్నప్పటికీ, పరిష్కారం కాని సంఘర్షణలు ఉన్న రైడర్‌గా విక్కీ పరిచయం అవుతాడు. అతని పోరాటాలు ట్రాక్‌పైనే కాదు, అతన్ని పెంచి, శిక్షణ ఇచ్చిన తండ్రితో. వారి మధ్య ఉన్న బాండింగ్ కథకు అద్భుతమైన ఎమోషన్ ని యాడ్ చేస్తోంది.

శర్వ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. రేసర్ గా ఆయన ప్రజెన్స్ అదిరిపోయింది. ఈ పాత్ర కోసం ఆయన ఫిజికల్ ట్రాస్ ఫర్మేషన్ మెస్మరైజ్ చేస్తోంది. నను తాను నిరూపించుకోవడానికి తపించే కొడుకు ఎమోషన్ ని అద్భుతంగా పండించారు. శర్వా ఇంటెన్స్ యాక్టింగ్ నెస్ట్ లెవల్ లో ఉంది.

రాజశేఖర్ రాజీపడని తండ్రి-గురువుగా పాత్రకు బలాన్ని చేకూర్చారు. ఆయన రీఎంట్రీలో ఇంతటి ఇంటెన్స్ పాత్రలో అతన్ని చూడటం కొత్తగా వుంది. అలజడితో కూడిన విక్కీ ప్రపంచంలో మాళవిక నాయర్ ప్రశాంతతను అందిస్తుంది. అతుల్ కులకర్ణి విలన్ ఛాయలున్న పాత్రను పోషించారు. వీరందరూ కలిసి అత్యంత ఉత్కంఠభరితంగా అనిపించే ఒక డ్రామాను అందించారు.

విజువల్ గా ట్రైలర్ అబ్బురపరిచింది. జె యువరాజ్ కెమెరా వర్క్ మోటోక్రాస్‌లోని ప్రమాదం, వేగాన్ని అత్యంత అద్భుతంగా చిత్రీకరించగా, గిబ్రాన్ అందించిన ఉత్కంఠభరితమైన సంగీతం ప్రతి రేసును ఒళ్లు గగుర్పొడిచే అనుభవంగా మారుస్తుంది. యూవీ క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా కనిపిస్తూ గొప్ప థియేటర్ అనుభూతినిచ్చేలా వున్నాయి.ఓవరాల్ గా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది.ఇక ఈసినిమాతో శర్వా ఈ ఏడాది వరుసగా రెండు విజయాన్ని ఖాతాలో వేసుకునేలానే వున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.