డెకాయిట్‌ నుండి జైన్ మేరీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

Zayn Marie Khan First Look from Dacoit Released

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జైన్ మారీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్‌లో భుజాలపై స్టార్ ఎపాలెట్స్, హోల్స్టర్ బెల్ట్‌తో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో జైన్ పాత్ర యొక్క ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తోంది. వెనుక వైపు ఇతర పోలీస్ అధికారులు ఉండటం ఈ సన్నివేశానికి మరింత బలం చేకూర్చింది.

ఈ పోస్టర్‌ను చూసిన ఆమిర్ ఖాన్ వెంటనే స్పందించి అభినందనలు తెలుపుతూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిందీ ప్రేక్షకుల్లో సినిమాకు మరింత హైప్‌ను తెచ్చింది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే మొదటి సాంగ్ ‘రుబారు’.. అన్నీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా
తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.

సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘డెకాయిట్‌’’కి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ దనుష్ భాస్కర్ రగ్డ్ విజువల్స్‌ను అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందిస్తున్నారు. గ్యాని అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎమోషన్ మరింతగా పెంచనుంది.

ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘డెకాయిట్‌’’ లవ్, హార్ట్‌బ్రేక్, అద్భుతమైన యాక్షన్ తో ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.