సంబరాల ఏటిగట్టు నుండి శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

Srikanth’s Birthday Celebrated with Special Poster from Sambarala yetigattu

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో  రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ఈ రోజు శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన్ని బ్రిటిషుగా పాత్రలో ప్రజెంట్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ రిలీజ్ చేశారు. ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడుగా ఆయన  లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వెట్రివేల్ పళనిసామి అందిస్తుండగా, సంగీతాన్ని బి. అజనీష్ లోకనాథ్ సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను నవీన్ విజయకృష్ణ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను గాంధీ నడికుడికర్ రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.