గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ లాక్

Gaayapadda Simham Gets a Locked Release Date

దర్శకుడిగా మరియు నటుడిగా తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ‘గాయపడ్డ సింహం’ మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మరియు ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ సినిమా పంపిణీ బాధ్యతలు చేపట్టిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేశారు. ఒకవేళ ‘పెద్ది’ సినిమా గనుక అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తే, బాక్సాఫీస్ వద్ద క్లాష్ రాకుండా ఉండేందుకు ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని ఒక వారం పాటు వాయిదా వేయనున్నామని ఆయన తెలిపారు.థియేటర్ల లభ్యత మరియు వసూళ్ల పరంగా ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక పెద్ది ఏప్రిల్ 30న విడుదలకావల్సివుంది. అయితే అనుకున్న సమయానికి రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తుంది. దాంతో మేకర్స్ గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నారు. ‘పెద్ది’ సినిమా గనుక సరైన సమయానికి రాకపోతే, తరుణ్ భాస్కర్ సినిమా మే 1వ తేదీనే థియేటర్లలో సందడి చేస్తుంది. ఒకవేళ వాయిదా పడితే మే రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.