ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 2026 సంవత్సరానికి సంబంధించి ఏకంగా 55 ప్రాజెక్టులు ప్రకటించింది. ఇందులో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు వున్నాయి. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఈ ప్రాజెక్టులు వెల్లడించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసారి తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా రాబోతున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:
ది ట్రైటర్స్: గ్లోబల్ హిట్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. దీనికి ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు.
గువ్వల చెరువు ఘాట్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్‌లో తిరువీర్, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇసాకపట్నం: ఐశ్వర్య రాజేష్ మరియు సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ క్రైమ్ డ్రామా.
ఇతర షోలు: ‘జగమే సంగీతం’, ‘గల్లీ’ వంటి కొత్త షోలతో పాటు, సూపర్ హిట్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ సీజన్ 2 కూడా రాబోతోంది.
మీర్జాపూర్ (సినిమా): ‘మీర్జాపూర్’ సిరీస్‌ను ఈసారి ఫీచర్ ఫిలిం రూపంలో నేరుగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
ఫర్జీ సీజన్ 2: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల క్రేజీ స్పై థ్రిల్లర్ సెకండ్ సీజన్ సిద్ధమవుతోంది.
పంచాయత్ సీజన్ 5: జితేంద్ర కుమార్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
DQ 41: దుల్కర్ సల్మాన్ , పూజా హెగ్డే ల రొమాంటిక్ ఎంటర్టైనర్ థియేట్రికల్ రిలీజ్ తరువాత ప్రైమ్ లోకి రానుంది.
గూఢచారి 2 (G2): అడివి శేష్ హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.
మట్కా కింగ్: విజయ్ వర్మ ప్రధాన పాత్రలో వస్తున్న పీరియాడిక్ డ్రామా.
వాన్ష్ – ది కలియుగ వారియర్స్: ఇండియన్ సూపర్‌హీరో నేపథ్యంలో సాగే సరికొత్త సిరీస్.
స్టార్మ్ (Storm): హృతిక్ రోషన్ నిర్మాణంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం.
మొత్తంగా క్రైమ్, థ్రిల్లర్, కామెడీ, సూపర్‌హీరో వంటి విభిన్న జోనర్లలో రాబోతున్న ఈ 55 ప్రాజెక్ట్‌లతో 2026లో ఓటీటీ ప్రియులకు భారీ వినోదం అందనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























