టీఆర్పీ రేటింగ్ లో సత్తా చాటిన మన శంకర వరప్రసాద్ గారు

mana shankara vara prasad garu impresses with high trp ratings

మెగాస్టార్ చిరంజీవి గారి ‘మన శంకర వరప్రసాద్ గారు’ బుల్లితెరపై కూడా మరోసారి తన ప్రభంజనాన్ని చాటింది. జీ తెలుగు ఛానెల్‌లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అవ్వగా ఏకంగా 14.2 టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ ఆయన ‘రాంపేజ్’ వెండితెరతోనే ఆగలేదు. ఫిబ్రవరి 28న ప్రసారమైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే, బుల్లితెరపై కూడా ఆయన సునామీ కొనసాగుతోందని స్పష్టమవుతోంది. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు టెలివిజన్ వేదికపై కూడా అదే స్థాయి రికార్డులను సృష్టించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ టీవీ ద్వారా ఈ సినిమాను ఎంతగా ఆస్వాదించారో ఈ రేటింగ్ నిరూపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వెండితెర, ఓటీటీ, బుల్లితెర.. ఇలా మూడు మాధ్యమాల్లోనూ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

అనిల్ రావిపూడి డైరెక్జ్ చేసిన ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ లో మెరిశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మించాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.